చిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించవద్దు అని నిపుణులు చెబుతున్నారు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు.