సీజన్ మారేకొద్ది చిన్నపిల్లలు తరచూ రోగాల బారిన పడుతుంటారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే చిన్న పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో పిల్లలకు ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, పాలు తాగించాలి.