చిన్న పిల్లలు తల్లిదండ్రులను చూసి పెరుగుతారు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే వారినే చూసి పిల్లలు బిహేవ్ చేస్తారు. అందుకే పెరిగే దశలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ముందు ద్వేషిస్తున్నట్లు ప్రవర్తించడం, గొడవపడటం, పని చేయమని చెప్పినప్పుడు తిరస్కరించడం, డిమాండింగ్‌గా మాట్లాడటం, బెదిరించడం, బూతులు మాట్లాడటం, సిగరెట్, ఆల్కహాల్ తాగడం వంటి పనులు చేయకూడదు.