దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతుంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. ఇక పిల్లల వయసును బట్టి మాస్క్ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటంటే ఐదేళ్లు కన్నా పెద్ద పిల్లలకు మూడు పొరల మాస్క్ లు తప్పనిసరిగా వాడాలి. అంతకన్నా తక్కువ వయసు పిల్లలకు మాస్క్ పెట్టడం వల్ల వారికి ఆక్సిజన్ అందే స్థాయి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.