నేటి సమాజంలో పెద్దవారిదే కాదు.. చిన్న పిల్లల తిండి కూడా మారిపోయింది. ఇక పిల్లలు ఐదు సంవత్సరాల నుండే నూడిల్, పిజ్జాలు అంటున్నారు. రోజూ వేపుళ్లూ, బేకరీ పదార్థాలు లేనిదే ముద్ద దిగదని మారం చేస్తున్నారు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం. గారాల పిల్లలు కదా. కాకపోతే ఆ పనికిమాలిన తిండి తిని వారు లావైపోతున్నారనీ, డయాబెటిస్ వంటి రోగాలకు సిద్ధపడుతున్నారనీ తెగ బాధపడిపోతుంటాం.