చిన్న వయసులో పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో దగ్గు కూడా ఒకటి. దగ్గులో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఏ రకం దగ్గో తెలుసుకుని వైద్యం చేయించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉందొద్దని, దగ్గుకు గల కారణాలు తెలుసుకుని చికిత్స చేయించాలని అంటున్నారు.