దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక కరోనా మరణాలు వేల సంఖ్యతో నమోదు అవుతున్నాయి. ఇక వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తుంటే ప్రతీ ఒక్కరిలో భయం కలుగుతుంది.