చిన్న పిల్లలు ఎక్కువగా పక్క తడుపుతూ ఉంటారు. ఇక అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి.