చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టిన బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో ఉంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా ఉంచాలని చెబుతున్నారు. పిల్లలు కనుక నెలలు నిండకుండా పుట్టి వుంటే, హాస్పిటల్ సిబ్బంది బిడ్డను వేరుగా ఇన్ క్యుబరేటర్ వంటి సాధనాలలో ఉంచి ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు వైద్యులు.