స్నానం అనేది మానవ శరీరానికి చాలా అవసరం. శరీర అలసటను దూరం చేయడానికి, చర్మం కాంతివంతంగా మెరవడానికి.. దుర్వాసన రాకుండా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి స్నానం ఎంతో అవసరం. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు కూడా వెల్లడించారు. బయటికి వెళ్లినప్పుడు వాతావరణంలోని దుమ్ము, ధూళి మన శరీరంపై పడతాయి.