సాధారణంగా చిన్న పిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే.. ఎదుగుతున్న సమయంలో దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెద్దయ్యాక గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా, గారాభంగా పెంచుతూ ఉంటారు.