అలాగే పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు. తల్లితండ్రులతో పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా, ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.
లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి 12 ఏళ్ల బాలురు నుంచి వృద్దులు వరకూ ఆడ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలతో మీరు ప్రేమగా ఉండండి.వాళ్ళు స్వతంత్రముగా మీకు ఏ విషయాన్ని చెప్పడానికి సంకోచించకుండా చూసుకోండి. అలాగే ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని టెక్నిక్స్ వున్నాయి. వాటిని నేర్పించoడి.
స్కూల్ లో ,ట్యూషన్ లో ఇతరుల ప్రవర్తన ఎలా ఉందొ రోజు కనుక్కోండి. ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల దూరం పాటించమని చెప్పండి. ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే, ముందుగా గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి. తరువాత అందుబాటులో వున్న రాయి, కర్ర ఇసుక లాంటివి వాడి వాళ్ళనుంచి తప్పించుకోవడం లో ట్రైనింగ్ ఇవ్వండి. పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి.
అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. ఇంట్లో అన్న తమ్ముళ్లు ఉంటే, సోదరికి సపోర్టివ్ గా ఉండటం నేర్పించండి. మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే.