కరోనా.. ఇంత కర్కశమా..? : వరంగల్లో ఓ ప్రభుత్వోద్యోగిని తోటి ఉద్యోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం గర్భిణి. ఈనెల 2న భర్తకు కరోనా వచ్చింది. 10న మామ కరోనాతో చనిపోయారు. అది తట్టుకోలేక12న అత్తమ్మ కన్నుమూసింది. భర్త 16న తుది శ్వాస వదిలాడు. వారం రోజుల్లోనే మామ, అత్త, భర్త తనువు చాలించారు. ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.