టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యజీవితంలో చక్కెరను వాడుతూ ఉంటాం. చాలామంది షుగర్ ఎక్కువ వేసుకుని మరీ టీ, కాఫీలు తాగుతుంటారు. మరికొందరు స్వీట్లు ఎక్కువగా తింటుంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్క్రీంలరూపంలో ఒంట్లోకి అదనపు చక్కెర చేరిపోతుంది.చక్కెర తో చేసిన వాటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక బరువును పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. చక్కెరను మితి మీరి తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని బెల్జియం నిపుణులు తాజా పరిశోధనలో వెల్లడించారు..