క్యాలరీలు తక్కువగా ఉండే, పోషకాలు ఎక్కువగా ఉండే పానీయాల్లో ఆల్మండ్ మిల్క్ బాగా పాపులర్ అయింది. ఆల్మండ్స్ ని రుబ్బి నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా ఆల్మండ్ మిల్క్ తయారు చేస్తారు. ఇది చూడడానికి పాల లాగే ఉంటుంది, నట్స్ ఫ్లేవర్ తో ఉంటుంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.