ప్రేమికుల రోజు అంటే ప్రేయసీ ప్రియులిద్దరూ ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటుంటారు. చాక్లెట్ల నుంచి మొదలు పెడితే.. కాస్ట్ లీ కార్లు, అపార్ట్ మెంట్ ల వరకు అన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి. మొబైల్ హవా బాగా నడుస్తున్న ఈ రోజుల్లో బంగారు నగలకంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా బహుమతుల రూపంలో చేతులు మారాయి. అయితే ఈ ఏడాది ఓ యువకుడు తనకు కాబోయే భార్యకు ఓ అరుదైన బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి ఏంటో తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే.