నో మాస్క్, నో ఎంట్రీ.. ఇదీ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న డైలాగ్, కనిపిస్తున్న స్లోగన్. మాస్క్ లేకుండా ఎవర్నీ ఎక్కడా లోపలికి రానివ్వొద్దు అంటూ షాపుల యజమానులకు ప్రభుత్వ అధికారులు కండిషన్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది అమలవుతున్న దాఖలా లేదు కానీ, మాస్క్ ఉంటేనే ఎంట్రీ అనే బోర్డ్ మాత్రం షాపుల ముందు కనపడుతుంది. అయితే ఓ షాపు యజమాని మాత్రం మాస్క్ లేకపోయినా లోపలికి రావొచ్చు అని బోర్డు పెట్టాడు. అంతమాత్రాన అక్కడ కరోనా తగ్గిపోయిందని చెప్పలేం. అయినా కూడా అమెరికాలోని ఓ రెస్టారెంట్ యజమాని ఈ సాహసానికి పూనుకొన్నాడు.