ఒమేగా -3 బలవర్థకమైన ఆహారాన్ని తినడం ద్వారా DHA పొందవచ్చు. అంటే మీరు తినే ఆహారంలో చేపలు, సీఫుడ్లతో సహా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా మీరు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. ప్రత్యేకంగా, సాల్మన్, ట్యూనా, మాకేరెల్ లేదా సార్డినెస్ వంటి కొవ్వు చేపలను ఎంచుకోండి. చేపలు ఇష్టపడని వారు గుల్లలు, మస్సెల్స్ నుండి పొందవచ్చు. ఇది మీ కోపం, ఒత్తిడిని తగ్గించడానికి సహాయం చేయడమే కాకుండా, నిరాశను నివారించడానికి, మీ మెదడు కార్యాచరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సాధారణంగా మానసిక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి..