టమోటాను కూరగాయ గాను, పండుగాను పిలుస్తారు.టమాట తినడం వల్ల చాలా లాభాలున్నాయి. చాలా తేలికగా చేసుకునే టమాట రసం సేవించడం వల్ల ఎంతో ఆరోగ్యం మన సొంతం అవుతుంది. టమాట రసంలో విటమిన్ బీ విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, కె, పొటాషియం, ఐరన్ మరియు ఇతరులు తగినంత మొత్తంలో ఉంటారు. అంతే కాదు ఇందులో విటమిన్ సి శాతం అధికంగా ఉంటుంది. అందుకే రోజు వారి ఆహారంలో భాగంగా టమాట రసాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.