ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలికి చెందిన విజయ్ పాల్ సింగ్ అలా కాదు.. సెంచరీకి చేరువైనా..పనే తనకు ప్రాణం అంటున్నారు. ఈ వయస్సులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న విజయ్ పాల్ సింగ్.. 98 ఏళ్ల వయస్సులో తన ఇంటి సమీపంలోని రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకుని దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతున్నారు.