వేప చెట్టు ఔషధాలకు నిలయం అని చెప్పాలి.. ఎన్నో రోగాలకు మందు. రోజు కాసింత వేపాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..అయితే వేప నూనె వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోతాయని అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. జుట్టు ఎదుగుదలకు, చర్మ సంరక్షణ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. హోమియోపతి యునాని వంటి వాటిలో విరివిగా వాడుతూనే ఉంటారు.