హైదరాబాద్లోని రిట్రో స్ట్రాస్ కంపెనీ.. సరికొత్త వినూతనాన్ని చేపట్టింది. అది ఏమిటంటే భూమిలో కలిసిపోయే స్ట్రాలను తయారు చేస్తోంది. వాటిని మనం తినే ఆహార పదార్థాలైన గోధుమలు, రైస్, టాపియోకా, నీటితో తయారు చేస్తోంది. ఇందులో ఎలాంటి రసాయన పదార్థాలు వాడడం లేదు..అయితే ఈ స్ట్రా ను తయారు చేసేటప్పుడు వీటిలో కలిపే రంగులు క్యారెట్ నుంచి ఆరెంజ్ కలర్, బీట్ రూట్ నుండి రెడ్ కలర్, అలాగే బచ్చలికూర నుండి గ్రీన్ కలర్ ను సేకరించారు. కూల్ డ్రింక్స్ లో ముంచినా ఈ స్ట్రా లు ఒక గంట పాటు గట్టిగానే ఉంటాయి. వీటిని వాడడం వల్ల మనతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్ట్రా లు ఏడాది వరకు నిల్వ ఉంటాయి.