కొవ్వును కరిగించడంలో పచ్చి మిర్చి చాలా బాగా ఉపయోగపడుతుంది.శరీరంలో తెలుపు, గోధుమరంగుల్లో కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్వ చేస్తుంది. గోధుమ రంగు కొవ్వు కణాలను కరిగించేలా చేస్తుంది. పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ ఉందని అమెరికాలోని వ్యోమింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి అని అంటున్నారు. వీటిలో విటమిన్-బి6, విటమిన్-ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి..