ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది.. ఎక్కడ చూసిన కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరం వేడిని తట్టుకుంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది.. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ కాకుండా ఫ్రూట్ , వెజిటబుల్ సలాడ్స్ ను తీసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు. అది కూడా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లతో లేదా వెజిటబుల్స్ తో ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.