రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. కాబట్టి, ముందు నుంచే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి కాన్సర్ కారక సమస్యలు రావు.ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. మధుమేహం రాకుండా ఉంటుంది.కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది.