నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌కూలర్ వాడటం మానేసిన సమయంలో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉంటే అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా 'వాటర్ కూలర్ నిమోనియా' అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా రావొచ్చునని నిపుణులు అంటున్నారు.