సైబర్ నేరగాళ్లు మన సమాచారం కొట్టేసేందుకు వలలు విసురుతుంటారు. అలాంటి ఓ మెస్సేజ్ ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతోంది. అదే పింక్ లింక్ మెస్సేజ్.. పింక్ వాట్సాప్ అంటూ ఓ లింక్ ఈ రోజు వైరల్ అవుతోంది. అది అచ్చంగా వాట్సాప్ లింక్లానే ఉంటుంది కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ ఉండదు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది.