చాలా మంది ఎల్ఐసీ పాలసీలు కడుతూ ఉండొచ్చు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. మనం పెట్టే సొమ్ము తిరిగిరాదు కాబట్టి చాలా మంది టర్మ్ జోలికి వెళ్లరు. రిటర్న్స్ ఆశించి కడుతున్న జీవిత బీమా పాలసీల్లో కవరేజి చాలా తక్కువ ఉంటుంది. మనపై ఆధారపడ్డవారు ఒక్కసారిగా రోడ్డున పడకుండా ఉండాలంటే, పెద్ద మొత్తంలోనే వారికి డబ్బు అందే పాలసీలు అవసరం.