సంక్రాంతి అంటేనే సంబరాల సమయం.. సంక్రాంతి జ్ఞాపకాలు.. ఏడాదికే కాదు.. జీవిత కాలం గుర్తుంటాయి. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకోండి.. సంక్రాంతి వస్తుందనగానే కొన్నిరోజుల ముందునుంటే గ్రామాల్లో మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి’ అంటూ హరిదాసులు సందడి చేసేవారు.

 

రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరించుకుని.. అయ్యవారికీ దండం పెట్టూ అంటూ గంగిరెద్దులవారు సందడి అంతా ఇంతా కాదు.. వీరే కాదు.. డమరుకం వాయిస్తూ.. అంబ పలుకు జగదంబ పలుకు అంటూ ఇంటింటి భవిష్యవాణిని వినిపించే బుడబుక్కల స్వాములు ఎటు చూసినా కనిపించేవారు.

 

ఇంకా.. పగడి వేషగాళ్లు, కొమ్మదాసరిలు, పిచ్చికుంట్లవారు, జంగం దేవరలూ, పిట్టల దొరలు.. ఎన్నిరకాల వారు సందడి చేసేవారు. అయితే ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు.

 

మరి ఇప్పుడు ఆ సందడి అంతా ఏమైనట్టు.. వారంతా కనిపిస్తున్నారా.. అందరూ కాకపోయినా వీరిలో ఒకరో ఇద్దరూ అడపాదడపా కనిపిస్తున్నారంతే. మారుతున్న కాలంతో కుల వృత్తులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అంతా కాల మహిమ అని సరిపెట్టుకోవాల్సిందే.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: