రాఖీ పౌర్ణమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే?
అవేంటంటే.. రాఖీ పండుగ సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని పెద్దలు అంటుంటారు. ఈ క్రమంలో పర్వదినాన పది మందికి అన్నం పెడితే పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. ఈ రోజున ఎవరైతే అన్నం దానం చేస్తోరో, అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేస్తారో వారికి ఇక లైఫ్లాంగ్ డబ్బుకు కొదవ ఉండదని పెద్దలు చెప్తుంటారు. ‘రాఖీ పౌర్ణమి’ రోజు చంద్రుడితో పాటు నవ గ్రహాల పూజలు చేస్తే దోష నివారణ జరుగుతుందట. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడుతో పాటు నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఇట్టే తొలిగిపోతాయట. నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు పెద్దలు. పేరెంట్స్, సోదర సోదరీమణులు, టీచర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దవారి పట్ల వినయ విధేయతలు చూపించడం ద్వారా వారి జీవితంలో సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు వివరిస్తున్నారు.
రక్షా బంధనం అంటే కేవలం అన్నా చెల్లెలు మాత్రమే కాదు అందరి అనురాగాలు, ప్రేమనుబంధాలు, మానవ సంబంధాలు, అనుబంధాలకు సంబంధించిన పండుగ అని పెద్దలు పేర్కొంటున్నారు. నేటి పరిస్థితులలో రాఖీ బంధన్ అనే పండుగ చాలా ముఖ్యమైనది. మహిళల పట్ల గౌరవాన్ని నిలిపేందుకుగాను ఇది సాయపడుతుందని పెద్దలు అంటున్నారు.