ఏ దేశ నాయకుడు వెళ్లినా ల్యాబీయింగ్ విధానం ద్వారా మన విధానాల్ని చెబుతారు. అమెరికా పర్యటనలో మోదీ ని వ్యతిరేకించడం వల్ల పాక్ చేస్తున్న ఉగ్రవాద తయారీ ముఠాల గురించి మోదీ మాట్లాడకుండా చేయాలని ప్లాన్ వేశారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులను చంపితే అక్కడ ముస్లింలను చంపినట్లుగా పాక్ సరి కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదులను తయారు చేేస్తున్న దేశం ఏదైనా ఉందంటే పాక్, ఆఫ్గానిస్తాన్ లు మాత్రమే. పాక్ గతంలో ఆఫ్గాన్ లో ఉన్న చాలా మంది అమాయకులకు తీవ్రవాద శిక్షణ నిచ్చి ఇండియాలో, ప్రపంచ వ్యాప్తంగా దాడులకు కారణమవుతుంది.
దీన్ని అంతర్జాతీయ సమాజం ముందు ప్రొజెక్టు చేయాలని మోదీ ప్రయత్నం చేశారు. ఇలా చేస్తే పాక్ పరువు పోతుంది. ప్రపంచానికి నిజం తెలుస్తుంది. కానీ పాక్ మాత్రం ఇలాంటి విషయాలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఒక ప్లాన్ వేసింది. మోదీ పర్యటన దెబ్బతినేలా ఇండియాలో ముస్లింలు అరాచకాలకు గురవుతున్నారని, వారికి స్వేచ్ఛ లేదని తద్వారా ఇండియాలో ముస్లింలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని పాక్ ఆరోపణలు చేసింది.
ముస్లిం ఎంపీలతో చేయించింది. కానీ ఇండియాలో ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదని తెలుసుకోవాలి. దీన్ని అమెరికా సాక్షిగా మోదీ ప్రస్పుటం చేశారు. దేశంలో ముస్లింలకు అన్ని రకాల భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. పాక్ లో కంటే భారత్ లోనే ముస్లింలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు.