సాధారణంగా ఇవి తాటి టెంకల నుండి ఏర్పడతాయి. తాటికాయ టెంకలను మట్టిలో పాతితే, మొలక వస్తుంది. ఆ మొలకే ఈ తేగలు. వీటిని కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా రుచికరంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టీ తేగలు బ్లడ్ క్యాన్సర్ ను అడ్డుకోవటంలో సహాయపడతాయి. వీటిని తలచు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో ఎక్కువగా పొటాషియం, విటమిన్-సి, బి3, బి1, బి2, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తేగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
పెద్ద పేగుతో మలినాలు చేరకుండా టాక్సిన్లను తొలగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ - సి, తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి, వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తేగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా మారుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో ఇది ఉపయోగపడుతుంది. తెగల్లో గ్రైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తినటం వల్ల ఒంటికి రక్తం పడుతుంది. షుగర్ ఉన్న వారు వీటిని తింటే బ్లడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను, వాటి పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.