సదరు వ్యక్తుల ఆసక్తులు, నైపుణ్యాలు, లక్ష్యాలు, అవసరాలు, వర్క్ ప్లేస్ వెదర్, సాలరీ వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పర్సనల్ స్కిల్స్ కెరియర్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు అంటున్నారు. అయితే ఇలా వదులుకుంటున్నా వారిలో స్త్రీ, పురుషులు ఉంటున్నప్పటికీ, ఎక్కువ శాతం స్త్రీలే ఉంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. చదువు పూర్తకాగానే ఉద్యోగాల్లో చేరిన కొంత కాలానికి, పెళ్లి ఫిక్స్ అవ్వటం, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, బాధ్యతుల వంటి కారణాలతో యువతి యువకులు ఉద్యోగాలు మానేస్తున్నారు. ఇక మహిళల్లో అత్యధిక మంది గర్భధారణ తర్వాత ప్రసూతి కోసం ఉద్యోగాలు మానేస్తున్నా వారి జాబితాలో ఉంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో 35 ఏండ్ల లోపు వారిలో 18 శాతం మంది ఉన్నా ఉద్యోగాన్ని వదులుకొని, కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే ఒక్కసారి జాబ్ వదులుకున్న తరువాత కెరియర్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించటంలో మాత్రం చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మొదట ఏదో ఒక కారణంతో జాబ్ మానేసి, కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ పాత సంస్థలోనే ఉద్యోగ ప్రయత్నం చేసే వారిలో చాలామంది విఫలం అవుతున్నారు. ఇక మొదట జాబ్ చేసినా సంస్థలో కాకుండా, మరో సంస్థలో ప్రయత్నించిన అప్పుడున్న పోటీ పరిస్థితుల్లో సాలరీ, వర్క్ స్టైల్, ఫెసిలిటి స్ వంటి అంశాల్లో ప్రతికూలతనే ఎదుర్కొంటున్నాయని, దీని కారణంగా కొందరు వినకడుగు వేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.