సాధారణంగా మనలో చాలా మందికి  చాలా ఫాస్ట్ గా ఆహారాన్ని తీసుకునే అలవాటు ఉంటుంది .  కొంతమంది వారి పనుల వల్ల ఆహారాన్ని కాస్త ఫాస్ట్ ఫాస్ట్ గా తినేయడం మనం చూస్తూనే ఉంటాం.. సాధారణంగా ఇలా ఫాస్ట్ గా మనం ఆహారన్నీ తినడం వల్ల అనేక సమస్యలు  ఎదురవుతాయని ప్రముఖ న్యూట్రిన్యెన్లు తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం కాలం మారుతున్న కొద్ది మనం తినే ఆహారం మాత్రమే కాకుండా మనం తినే విధానం కూడా ఎంతో కీలకమని న్యూట్రిన్యెన్లు తెలియజేస్తున్నారు.  వేగంగా తినే క్రమంలో మనం ఎక్కువగా గాలిని మింగుతాము.. దీనివల్ల అజీర్తి, గ్యాస్, అధిక ఆమ్లత్వం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్స్ వెల్లడిస్తున్నారు.

 అంతే కాకుండా మనం వేగంగా ఆహారం తీసుకునే క్రమంలో మనకి అవసరమైన దాని కంటే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.  దీంతో మనం బరువు కూడా ఎక్కువ మోతాదులో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వేగంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన గుండె రేటు కూడా భారీగా పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కేవలం గుండె రేటు పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి , నిద్ర లేమి సమస్యలు, చర్మ సమస్యలు, చుట్టూ రాలడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.. ఇక అలాగే నిదానంగా భోజనం చేసేవారిలో డయాబెటిస్, పీసీఓడీ, బిపి లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయని డాక్టర్ తెలియజేస్తున్నారు. కాబట్టి చాలా వరకు మనం ఆహారం తినే సమయంలో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నిదానంగా ఆహారాన్ని సేవించడం మంచిదని డాక్టర్లు సూచనా..

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే .. మనం ఆహారం తినే సమయంలో ప్రతి నోటికొక ముద్ద మాత్రమే తీసుకోండి.ఆహారాన్ని బాగా నమిలి తినండి.ఆహారం తింటున్నప్పుడు చుట్టూ ఉన్న వారితో మాట్లాడకుండా ఉండడం మరింత ముఖ్యం. అలాగే  ఆహారం తినేటప్పుడు మీరు తినే ప్రతి ముద్దను ఆస్వాదించండి చాల మంచిది .ఆహారం తినే ముందు మరియు తరువాత కచ్చితంగా  నీరు తాగే అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: