తరచుగా మరిచిపోయే అలవాటు ఉన్నవారు మెమరీ పవర్ పెరగాలంటే ' రీకాల్ మెథడ్స్' అనుసరించాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకోసం మొదటి వీరు గుర్తుంచుకోవాలనుకుంటున్నా విషయాన్ని లేదా ఫస్ట్ లెటర్ ను బాగా గుర్తుంచుకునేలా ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే విషయం గుర్తుండిపోయేందుకు మళ్లీ మళ్లీ చదువుతుండాలి. దీనివల్ల ఆ కంటెంట్ మెదడులో నిక్షేపమై పోతుంది. ఇక ఎక్కువ పెద్దగా, సుదీర్ఘంగా ఉండే మేటర్ లేదా విషయాలు ఏమైనా త్వరగా మర్చిపోయా అవకాశం ఉంటుంది.
కాబట్టి దీనిని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి పదేపదే చదివే రీకాల్ పద్ధతిని అనుసరిస్తే గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ విధంగా చదివితే గుర్తుంటుంది. మనం చదివేటప్పుడు మన మైండ్ చదువు పైనే ఉండాలి. బయటకి చూడటం ఇలాంటివి చేస్తే మైండ్లో అసలు గుర్తు ఉండదు. మనం చదువుకునేటప్పుడు చదివే దాన్ని బాగా తెలుసుకొని అప్పుడు చదవడం మొదలు పెట్టాలి. ఇలా చేయటం వల్ల చదివింది గుర్తు ఉంటుంది. కాబట్టి చదువుకునే వారు తప్పకుండా ఎలా ట్రై చేయండి. చదివేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కానీ మళ్ళీ సరిచేసుకుని మళ్లీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా చెయ్యటం వల్ల మళ్లీ క్లారిటీగా చదవడం వస్తుంది. మైండ్ లో గుర్తుండిపోతుంది.