దీనినే ' హాలిడే హాట్ సిండ్రోమ్ ' గా పేర్కొంటున్నారు. నిజానికి హాలిడే హార్ట్ సిండ్రోమ్ ను చిన్న రుగ్మతగా భావిస్తుంటారు చాలామంది. కానీ కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్య గాను మారవచ్చు. అందుకే తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హాలిడే లేదా పండగల రోజుల్లోనే ఇది ఎందుకు ఎక్కువగా వస్తుందంటే... ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఏమిటంటే... ప్రస్తుతం సెలవులు, పండగలు, ఫంక్షన్లు, పార్టీలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే చాలామంది ఆల్కహాల్, వివిధ పానీయాలు ఎక్కువగా తాగటం, రకరకా ఆహారాలు,
స్వీట్స్ వంటివి తినటం చేస్తుంటారు. ఈ పరిస్థితి గుండె వేగంగా కొట్టుకోవడానికి దారితీస్తుంది. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఆ సందర్భంలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే హాలిడే రోజు తీసుకునే ఆల్కహాల్, ఇతర పానీయాలు, ఆహారాల వల్ల అందరూ గుండెకు సంబంధించిన ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటారని కూడా చెప్పలేం. కొందరికి హార్ట్ బర్న్, కడుపులో ఉబ్బరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరిగి, బ్లడ్ ప్రెషర్ అధికమై ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.