రోజు బీరు తాగితే ఆరోగ్యం పాడవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. డైలీ బీర్ ని అసలు తాగకండి. ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. కానీ బీరు తాగితే నో ప్రాబ్లం...! అంటున్నారు కొందరు. ఇందులోనూ కొంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి బీరు కూడా మంచిది కాదని మరి కొందరు చెబుతుంటారు. అయితే తక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని, అధికంగా తాగితే ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

' ఇండియన్ జర్నల్ మెడికల్ రీసెర్చ్' లో పబ్లిషైన ఓ ఆధ్యాయన సారాంశం ప్రకారం వీరు మితంగా తాగితే హెల్త్ బెనిఫిట్స్, అతిగా తాగితే ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు అదిగా తాగితే మూత్రం ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆధ్యాయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. చలికాలంలో తరచుగా తాగటం వల్ల మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది.డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా శరీరంలో కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, పొట్ట పెరగటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

 వీరును మితంగా, అంటే .. రోజు ఒక టీ కప్పు పరిమాణంలో తాగటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఎముకల సాంద్రతను పెంచుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు పేర్కొన్నాయి. అంతేకాకుండా బీర్లు పాలి ఫెనాల్స్, ఆమైనో ఆసిడ్స్, విటమిన్లు కూడా ఉంటాయి. మితంగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీఆక్సిడెంట్స్ ఉండటం మూలంగా తక్కువ మోతాదులో బీరు తాగటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే యాక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం ద్వారా గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది. బీరులో విటమిన్ బి1, బి2, బి6, బి9, బి12, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. నిజంగా తాగితే ఇవి బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, ఎర్ర రక్త కణాలన నిర్మాణానికి దోహాద్ పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: