అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల మేకప్ లు వేస్తూ ఉంటారు. రకరకాల ఫేషియల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉండి రకరకాల టిప్స్ ని పాటిస్తారు. ఆడవాళ్లు తమ అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తమ మొహం బాగోలేదని తెలిస్తే వెంటనే ఏదో ఒక ఫేషియల్ చేయించుకుంటారు. అందంగా కనిపించాలన్న ఆరాటం అందరిలో ఉంటుంది. అయితే కొన్నిసార్లు చర్మంపై మృత కణాలు పెరిగి, పగుళ్లు ఏర్పడి డ్రైగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ముఖ వర్భస్సు తగ్గుతుంది. దీంతో రకరకాల క్రీములు వాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే అలాంటి అవసరం లేకుండా ఇంటి చిట్కాతోనే ఫేస్ గ్లోయింగ్ పెంచుకోవచ్చని మీకు తెలుసా?

 అదెలాగో చూద్దాం. నిమ్మకాయలో విటమిన్ సి, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఓ గిన్నెలో తేనె, పాలు, నిమ్మరసం సమపాలలో మిక్స్ చేయండి. తర్వాత ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగండి. అప్పుడు మీ ముఖ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బియ్యపు పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా పిండి తీసుకోవాలి.

కొంచెం ఆమదం, కొన్ని పాలు కలపండి. ఈ విశ్వనాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేస్తే చాలు. ముఖ వర్చస్సు పెరుగుతుంది. యంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున పసుపు, పెరుగు కూడా స్కిన్ బ్లోయింగ్ కోసం ఉపయోగపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ పసుపు కలిపి పేస్టులా మారాకా ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. దీంతో ఫేషియల్ అవసరం లేకుండానే మీ ఫేస్ నిగనిగా లాడుతుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అందరూ ఇంట్లోనే ఉండి ఈ టిప్స్ ని పాటించండి మీ అందం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: