వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణను పట్టాలు తప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంతరణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. ముఖం కూడా ఉబ్బినట్లుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది. కాబట్టి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీర్ లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడిటివ్ స్ట్రెస్ జరుగుతుంది.
దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బీర్ కి చాలా దూరంగా ఉండటం మంచిది. బీర్ ఎక్కువగా తాగితే లివర్ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎంతో బీర్ కూడా అంతే. కాబట్టి ఈ రెండిటిని అసలు తాగకండి. బీర్ మరీ ఎక్కువగా తాగటం వల్ల బాడీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన అందం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. బీర్ ఎక్కువ మోతాదులో తాగితే గుండె నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బీర్ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు.