ఈ తరంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫుడ్ పాయిజన్ అనే వినిపిస్తుంది. ఈ తరంలో ఫుడ్ పాయిజన్ మరీ ఎక్కువగా పెరిగిపోయింది. ఫుట్ పాయిజన్ ఎందుకు అవుతుందో తెలుసా? ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండి తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్లో, వివిధ పాఠశాలల్లో వరసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి? అది ఎందుకు అవుతుంది? ఎలా నివారించాలి? అనే విషయాలపై పలువురు చర్చించుకుంటున్నారు. ఇపునులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆహారం తినగానే కళ్లు తిరగటం. కడుపు నొప్పి రావడం, వాంతులు, విరేచనాలు కలగడం వంటి ఇబ్బందులను మీరు అనుభవిస్తే గనుక వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు ఆరోగ్యానికి నిపుణులు. ఎందుకంటే అది మీరు తిన్న ఆహారం విషం గా మారటం వల్ల తలెత్తే సమస్యలు కూడా కావచ్చు. అందరికీ వెంటనే జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి కూడా వస్తాయి. ఈ పరిస్థితినే ఫుడ్ బొర్న ఇల్ నెస్ లేదా ఫుడ్ పాయిజనింగ్ అంటారు. మనం తీసుకునే ఆహారం, పానీయాలు శరీరానికి పడనివి అయినప్పుడు, అవి కలుషితమైనవి అయిప్పుడు, అందులో విషపూరిత రసాయనాలు కలిగి ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 మన దేశంలో అయితే ఎక్కువగా ఎంటమీబా అనే బాక్టీరియా అందుకు కారణం అవుతుంది. దీంతోపాటు క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు, నోరో వైరస్ వంటివి కూడా ఆహారాన్ని విషతూల్యం చేయటం కారణంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. తిన్న ఆహారం విషయంగా మారితే కడుపులో నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటివి వెంటనే లేదా కాసేపటి తరువాత గాని తలెత్తుతాయి. కొందరికి వెంటనే బాడీ టెంపరేచర్ పెరిగిపోయి జ్వరం రావడం, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం జరగవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, డయాబెటిక్ పేషెంట్లు, క్యాన్సర్ రోగులు దీని బారిన పడుతుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: