చాలామంది బీట్ రూట్ ని ఇష్టంగా తింటారు. మరికొంతమందికి మాత్రం బీట్ రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు. చాలామంది శరీరంలో రక్తం కోసం, ఐరన్ లోపంను తగ్గించుకోవడానికి బీట్ రూట్ తింటారు. ఇది బీట్ రూట్ అనేది రక్తహీనత ఉన్న వారికి మేలు చేస్తుంది. ప్రతిరోజు దీనిని జ్యూస్ చేసుకుని తాగితే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచడంలో సహాయపడుతుంది. అయితే, దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నా సరే, అదిగా దీనిని తినటం లేదా తాగటం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 అవేంటో ఇప్పుడు చూద్దాం. బీట్ రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, అదిగా తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో నైట్రేట్ అధిక మొత్తంలో ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకున్నప్పుడు జీర్ణం వ్యవస్థ దెబ్బతింటుంది. కొంతమందికి ఈ జ్యూస్ తాగిన తరువాత కడుపులో నొప్పి కూడా వస్తుంది. గర్భిణీ స్త్రీలు బీట్ రూట్ ని వైద్యుల సలహా తీసుకుని తినటం మంచిది. బీట్ రూట్ లో ఆక్సలేట్ లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్న వారిపై బీట్ రూట్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కిడ్నీలో రాళ్లు సమస్యల ఉన్నా లేదా అప్పటికే సమస్యతో బాధపడుతున్న వారు అయినా వీటిని తినటం వల్ల ఆ రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి. ఇది మూత్రంలో ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది. అలర్జీ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మంపై దురద, గొంతు సమస్య, వాపు బంటి సమస్యలు వస్తాయి. దుంపలు తింటే అలర్జీ వచ్చేవాళ్లు దీనిని తినకపోవడం మంచిది. చాలామంది దీనిని కూరలు, సలాడ్ లో కాకుండా జ్యూస్ గా తీసుకుంటారు. దీనివల్ల ఆరోగ్యం బాగుందని అనుకుంటారు. కానీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్ తాగటం వల్ల కడుపులో నొప్పి, డయేరియా, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: