జగన్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. మరో 15 నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ఇక అప్పుడు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు బెర్త్ ఖాయమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం ప్రసాదరాజుకు మంత్రి పదవి రాబోతుందని ముందే హింట్ ఇచ్చేశారు.