తెలుగుదేశం నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో బాగా స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వారికి అధికారంలో ఉన్న వైసీపీ సైతం చెక్ పెట్టడం కష్టమైపోతుంది. వారి స్పీడుకు జగన్ పథకాలు సైతం బ్రేకులు వేయలేకపోతున్నాయి. అలా టీడీపీలో బాగా స్ట్రాంగ్‌గా ఉన్న వారిలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..ముందు వరుసలో ఉంటారు.