ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆఖరికి పవన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఇంత ఓటమిలో కూడా పవన్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చిన విషయం రాజోలులో జనసేన తరుపున రాపాక వరప్రసాద్ విజయం సాధించడం.