ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దెబ్బకు విశాఖపట్నంలో టీడీపీకి కష్టాలు మొదలైన విషయం తెలిసిందే. చంద్రబాబు మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ టీడీపీ నేతలకు ఎటు మద్ధతు ఇవ్వాలో అర్ధం అవ్వక సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.