ఏపీలో వరుసగా పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా గెలుపు గుర్రం ఎక్కే నేత ఎవరైనా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావునే. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలవగా, 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2008లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.