అధికార వైసీపీలో యువనేతలకు కొదవ లేదనే చెప్పొచ్చు. జగన్ అండతో పలువురు యువనేతలు పార్టీలో కీలకంగా ఎదిగారు. అలాగే 2019 ఎన్నికల్లో చాలామంది యువనేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి దూసుకెళుతున్నారు. ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తూ, తమ అధినేత జగన్కు అండగా ఉంటున్నారు. అలా వైసీపీలో దూకుడుగా ఉన్న యువ ఎమ్మెల్యేల్లో గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉంటారు.