2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో టీడీపీలో ఉన్న బడా బడా నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అలాగే జగన్ ఇమేజ్ వల్ల పలువురు యువ ఎమ్మెల్యేలు టీడీపీ సీనియర్లని మట్టికరిపించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వారిని కోలుకోకుండా చేస్తున్నారు. అలా టీడీపీ సీనియర్లని కోలుకోకుండా చేస్తున్న యువ ఎమ్మెల్యేల్లో విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఒకరు.