అధికార వైసీపీలో మంచి మాటకారులకు ఎలాంటి కొదవ లేదనే చెప్పొచ్చు. తమదైన శైలిలో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు చెక్ పెడుతుంటారు. యాస, ప్రాసలతో పంచ్‌లు వేస్తుంటారు. అలా పంచ్‌లు వేసే నాయకుల్లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉంటారు. విశాఖ జిల్లాకు చెందిన ధర్మశ్రీ ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడంలో ముందుంటారు. అసెంబ్లీలో గానీ, మీడియా ముందు గానీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా మాట్లాడగలరు.