ఏపీలో వైసీపీ సర్కారులో కీలక హోదాలో ఉన్న మంత్రి.. ఒకరు తన శాఖకు చెందిన కార్యకలాపాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం బాగానే ఆయన పనులు వర్కవుట్ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ మంత్రి ఎవరు ? స్టోరీ ఏంటో చూద్దాం. కడప జిల్లా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కిన అంజాద్ బాషాకు సీఎం జగన్ మైనార్టీ మంత్రిపదవిని కట్టబెట్టారు. సౌమ్యుడు, వివాద రహితుడు, అందరినీ కలుపుకొని పోయే నాయకుడుగా మంచి గుర్తింపు ఉన్న బాషాకు ఈ పదవి ఇవ్వడాన్ని మైనార్టీ వర్గం ప్రతిష్టాత్మకంగా భావించింది.